9 .4 .12
నిశ్శబ్దం ఒక అంతరంగ సంగీతం
నిశ్శబ్దం ఒక లబద్ధ గీతం
నిశ్శబ్దం ఒక చారిత్రిక ఆవహనం
నిశ్శబ్దం ఒక పరిమళ పూలగుచ్చం
శబ్ద ప్రపంచం ఒక ధ్వని కాలుష్యం
మనిషి తననుతాను పునర్వివేచించు కోవడానికి
కొన్నిక్షణాలు దాచుకోలేక పోతున్నాడు
వేగం అతివేగం అంతర్మధనానికి దూరం
సింహం కూడా వెనక్కి తిరిగి చూసుకున్నాకే
ఒక్కడుగు ముందుకు వేస్తుంది.
Dr .Kathi Padma Rao

No comments:
Post a Comment