28.7.11
గుడ్ల గూబల్లా
గుడ్ల గూబల్లా
రాజకీయ మర్రిఊడలకు
వేలాడుతున్న నాయకులు
ద్వంద్వ ప్రమాణాలు
నిర్మిస్తున్నారు
తాకట్టులో వున్న భారతం
మెదడుల్లో గూడుకట్టుకున్న
బానిసత్వం
బానిసలకు బానిసలను
సృష్టిస్తూనే వుంది.
అవినీతి పరులందరినీ
జైళ్ళలో కుక్కితే
ఊరు వాడవుతుంది
వాడ ఊరవుతుంది.
No comments:
Post a Comment