సూరీడు ఎక్కడో లేడు!

                                                                                                            ౨౬.౭.11
చినుకులు పడుతున్నపుడల్లా
ఆకాశం భూమికి వాలినట్లు
సముద్రం పక్కనే ధ్వనించినట్లు
ఆకులు  ముత్యాలతో
అలంకరించుకున్నట్లు ఉంటుంది.  

కానీ, ఆ వాడ మధ్యలో పారుతున్న
మురుగు కాలువ
స్వయిన్ ఫ్లూ, డెంగ్యు, మలేరియాలను
వ్యాప్తిచేస్తూ   వెళ్తుంది.

ప్రకృతి  రమణీయత  శిధిలమౌతుంది
మనోవైకల్యాలు ప్రబలుతున్నాయి
మనుషులు  అనారోగ్యంతో
కునారిల్లుతున్నారు
ఈనాటి  చినుకు భారతం యిదే!
కునుకులేని జీవుల ఆర్తనాదం కూడా యిదే!

మసకపడడానికీ,
వెలుగురావడానికీ మధ్య
గీతలులేని బ్రతుకులు.

నిజమే!
సూరీడు ఎక్కడో లేడు
ఆలోచనల్లో, గుండెల్లో ......

         









No comments:

Post a Comment