ప్రతి రాజూ హంతకుడే!

ప్రతి రాజూ హంతకుడే!
రాజకుమారులు ఆ సమాధుల
సంఖ్యను పెంచేవారే
వీరు చేసే కీర్తనలన్నీ
మరణ గీతాలే
జీవించేవాడు ఒక్కడే
సమాజ గతిని నిర్ణయించేవాడే
వాడే దార్శనికుడు!

నిజానికి యుద్ధం
యిప్పుడే ఆరంభమయింది
జీవితంతోనూ! సమాజంతోనూ!
మనిషి తననుతాను
తెలుసుకునే లోపే
మరణించడం ఒక సత్యం
యుద్ధ ప్రియులే జీవిస్తున్నారు
జీవించినప్పుడూ
మరణించినప్పుడు..

No comments:

Post a Comment