25.7.11
సూర్యోదయంలో
రంగులీనుతున్న అడవి
ఆ పక్షులు ఆకాశానికి
రంగులద్దడానికి
పయనిస్తున్నాయి.
మనుషులు ఒళ్ళంతా
చిత్రచిత్ర వర్ణాలు
పొడిపించు కుంటున్న
ప్రతిసంధర్భంలో
అడవి నవ్వుతూనే వుంది!కొమ్మను అంటిపెట్టుకున్న
అత్తిపండ్లనిండా జీవులు
బ్రతుకుతూనే వున్నాయి.నిజానికి,
ఆ చిరుతపులి కంటే
ఆ రంగుల పక్షే
స్వేఛ్చగా బ్రతుకుతుంది
నీతి అవినీతి రెండే రంగులు
ఎటో తేల్చుకోండి!
No comments:
Post a Comment