అధికారం మత్తేకాదు వంచనకూడా!

                                                                                                         30.7.11
గిరిజనులు మన్యంలో
జ్వరపీడితులు
మంచాలకు కట్టుకొని
మైళ్ళకు మైళ్ళ దూరాలకు
కాలినాడకలో.
రాజీనామాలకూ,
రాజీపడడానికి
ఏంపీలేమో విమానాలపై
ఉరుకులు.
ప్రాణాన్ని రక్షించడానికి
వాహనంలేదు
పదవిని రక్షించడానికి
బహు వాహనాలు
అవును!
అధికారం మత్తేకాదు
అధికారం వంచనకూడా!



గాంధీ మార్గమే ఒక సున్నా

                                                                                                              29.7.11
మనిషిని మళ్లీ
మనిషి చేయడం
అసాధ్య చర్య.
రుగ్మతలన్నింటి సమాహారంగా
నేటి మనిషి.
పుట్టుకను మరచిన మనిషికి
గమ్యమూ లేదు.
గమనాన్ని నిర్దేశించేది
రూపాయి అయినప్పుడు
నీతిని అవినీతిగా
మార్చడమే ఆధిక్యమైనపుడు
బిల్లులూ చట్టాలూ
మార్పులు తెస్తాయా!
అన్నా! గాంధీ మార్గమే
ఒక  సున్నా.

Birthday wishes

నల్ల కలువ పుట్టిన రోజు...వాడలోకి నల్ల సూర్యుడు నడిచి వచ్చిన రోజు... Afsar Mohammed

wish u happy birth day. meeru dalithula kosam marinni udyamaalu cheyalani korukunta. Laxminarayana Masade

Many happy returns of the day.May you continue to excel in your fight against discrimination and betterment of the society... Ronald Ernest

MANY HAPPY RETURNS MAY YOU CONTINUE TO CONTRIBUTE TO CASTELESS AND JUST SOCIETY - RANJANI

wishes u happy birth day and on the occasion of your birthday we also feel that our country needs thousand "padma rao's" to change the Indian society and wishes u all the best in this year for your activities for the Dalit communities- TSA EFLU

కత్తి పద్మారావు గారు! సమాజంలో మనుషుల జీవితాలను మరింత కాలం ప్రభావితం చేయడానికి,మనుషులను మరింత ఉన్నత మానవులుగా మార్చడానికి,మానవ సమాజాన్నే మరింత పరిపూర్ణమయిన మహోన్నతమయిన సమాజంగా దిద్ది తీర్చడానికి, మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని,నిండు నూరేళ్ళు పూర్తి ఆరోగ్యంతోను,సుఖ సంతోషాలతోను,గడుపుతూ సమాజంలో ఇప్పటి మీ కృషి,ఇలాగే అర్ధవతంగా కొనసాగించాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను..........c​ontd........ Sambasiva Rao Kakani

Jai phule...jai bhim....jai mulavaasi....jai telangana...jai andhra...Dalita ashaa jyothi Padma rao gariki janmadina shubhakankshalu.....Aluperagan​i mi poratam Dalithulaki adikaram vachedakedaka mi venta memu untam ani cheputhu.....my sincere request z dt plz spread jai Andhra movement among seemandhra ppl.....bcoz ppl lik u hav 2 f8 frm andhra in order 2 get our Telangana state....hoping for d best and hav a wonderful life ahead...... Karthik Thadishetty


My Advanced Birth day wishes to Dr.Kathi Padma Rao Garu ...The Champion of Dalit Movement in Andhra Pradesh .. He has awoken the people of Andhra Pradesh through his speeches ..writings and bringing the Ideology of Ambedkar to all sections of the people to understand Dr.B.R. Ambedkar in a better way ... Dr. Kathi Padmarao Garu is an Inspiration to lakhs of people ...Kranthi Kumar Korabandi
 
I thank each and every one who renedered their valuable wishes on my Birthday.

బానిసత్వం

                                                                                                    28.7.11
గుడ్ల గూబల్లా
రాజకీయ మర్రిఊడలకు
వేలాడుతున్న నాయకులు
ద్వంద్వ ప్రమాణాలు
నిర్మిస్తున్నారు

తాకట్టులో వున్న భారతం
మెదడుల్లో గూడుకట్టుకున్న
బానిసత్వం
బానిసలకు బానిసలను
సృష్టిస్తూనే వుంది.

అవినీతి పరులందరినీ
జైళ్ళలో కుక్కితే
ఊరు వాడవుతుంది
వాడ ఊరవుతుంది.

  


సూరీడు ఎక్కడో లేడు!

                                                                                                            ౨౬.౭.11
చినుకులు పడుతున్నపుడల్లా
ఆకాశం భూమికి వాలినట్లు
సముద్రం పక్కనే ధ్వనించినట్లు
ఆకులు  ముత్యాలతో
అలంకరించుకున్నట్లు ఉంటుంది.  

కానీ, ఆ వాడ మధ్యలో పారుతున్న
మురుగు కాలువ
స్వయిన్ ఫ్లూ, డెంగ్యు, మలేరియాలను
వ్యాప్తిచేస్తూ   వెళ్తుంది.

ప్రకృతి  రమణీయత  శిధిలమౌతుంది
మనోవైకల్యాలు ప్రబలుతున్నాయి
మనుషులు  అనారోగ్యంతో
కునారిల్లుతున్నారు
ఈనాటి  చినుకు భారతం యిదే!
కునుకులేని జీవుల ఆర్తనాదం కూడా యిదే!

మసకపడడానికీ,
వెలుగురావడానికీ మధ్య
గీతలులేని బ్రతుకులు.

నిజమే!
సూరీడు ఎక్కడో లేడు
ఆలోచనల్లో, గుండెల్లో ......

         









ఎటో తేల్చుకోండి!

                                                                                                            25.7.11
సూర్యోదయంలో
రంగులీనుతున్న అడవి
ఆ పక్షులు ఆకాశానికి
రంగులద్దడానికి
పయనిస్తున్నాయి.

మనుషులు ఒళ్ళంతా
చిత్రచిత్ర వర్ణాలు
పొడిపించు కుంటున్న
ప్రతిసంధర్భంలో
అడవి నవ్వుతూనే వుంది!

కొమ్మను అంటిపెట్టుకున్న
అత్తిపండ్లనిండా జీవులు
బ్రతుకుతూనే వున్నాయి.

నిజానికి,
ఆ చిరుతపులి కంటే
ఆ రంగుల పక్షే
స్వేఛ్చగా బ్రతుకుతుంది

నీతి అవినీతి రెండే రంగులు
ఎటో తేల్చుకోండి!

సామాజిక అంతరాలు రగులుతున్న కొండలే!


                                                                                                                      22.07.11
మరణించిన వాణ్ణి పూడ్చడానికి
చారెడు నేలలేదు
విదేశీ కంపెనీలకు
వేలవేల ఎకరాల ధారాదత్తం

హిల్లరీ క్లింటన్
ఆసియా సంపన్న మైనదని
పొగుడుతుంది
తెల్లవాళ్ళ కన్ను
భూమి మీదకు కాదు
భూమి పోరాల్లోకు కూడా
చొచ్చుకెళ్తుంది

శ్రీలంక తమిళుల
మీద వున్న ప్రేమ
భారతదేశంలో దళితుల
మీదలేదే!

అణచివేత ప్రపంచం అంతటా వుంది
సామ్రాజ్య వాది
తన అవసరాల కోసమే మాట్లాడుతుంది
సామాజిక అంతరాలు
ఎప్పుడూ రగులుతున్న కొండలే!

అడ్డుగోడలెవరు?

                                                                                                                                 20.7.11
స్టార్ హోటళ్ళలో
పసందైన విందులు
చినుకు చిత్తడిలో
ముద్దవుతున్న పసికందులు
అసమ సమాజంలో
మిట్టలపై లోయలపై
ఒకేచూపు
కొండపై కెక్కినోడు
కింద వైపు చూడడాయె !
లోయలోని గడ్డిపూలకు
సూర్య కిరణాలు తగలకుండా
అడ్డుగోడలెవరు?

చూసే చూపును మార్చండి!

                                                                                                    19.7.11
అస్పృశ్యతా భావం
రూపాలు మార్చుకుంటుంది
ముఖ ముఖానికీ
కళ్ళలో భావాలు మారుతున్నాయి
తెల్ల ద్రాక్షాలకంటే
నల్ల ద్రాక్షాలే అందమైనవి
భూమినుండి తొలుచుకు రావడం
ఒక నేరమా!
ఆకాశం నుండి కురవడం
ఒక వరమా!
వెన్నెలకంటే చీకటి నిడివే పెద్దది
ముందు చూసే చూపును మార్చండి
కొత్త ప్రపంచం కనిపిస్తుంది!

చరిత్రను మార్చడమే ఉద్యమం

                                                                                                            17.7.11
కారంచేడు మృతవీరులు
చిందించిన రక్తం
దళితుల చరిత్రకు
ఎత్తిన పతాకం
యుద్ధ యోధులుగా
మరణించిన వారెవరైనా
చరిత్ర గుండెలపై
శిలా శాసనాలే అవుతారు
చరిత్రను వల్లించడం కాదు
చరిత్రను మార్చడమే ఉద్యమం

What happened in Karamchedu?

Karamchedu village is located 7 km off from Chirala in Prakasam District of Andhra Pradesh State. The village was a big Panchayat with 16 wards. Kammas, the landlord community, lived in eight wards. Other eight wards comprised of BC, SC and ST people. Dalits resided in the 16th ward. As Kammas outnumbered people of other castes, they had the last word on everything. Kammas were very rich, they were arrogant. No wonder, Karamchedu was ridden with obnoxious feudal culture. There was no place for modern and progressive ideas in the village. The Kamma caste ruled the roost. Yadavas, Rajakas, Nayibrahmins, Upparas, Chundu nayaks, Muslims, Yerukulas, Yanadis, Malas and Madigas were living in the village. Kammas owned thousands of acres of land. They presided over and decided all village affairs. The big shots among them included families of Daggubati, Chaganti, Yarlagadda, Perni, Manda and Puvati. The fattened Kammas ill-treated, humiliated and physically asaulted workers who toiled in their houses. They were also known to murder their workers and the corpse dissapeared for ever. Ten years before the Karamchedu carnage, Upperas, Backward Caste people, rebelled against brutality of Kammas. The latter frequently raided Upperapalem and attacked Upperas. Venkateswarlu, a Chundunayak leader, tried to organise peasants for a wage hike. Kammas barbarically assaulted him. Venkateswarlu ranaway and hid himself in the Madigapalle. Kammas asked Madigas to hand over Venkateswarlu to them. Madigas rejected Kammas' demand. They told Kammas bluntly that they would protect Venkateswarlu at the cost of even their lives. Unable to face Madigas, they went back. Kammas, from that day, nurtured hatred against Madigas. Later they attacked Malas. Madigas rescued Malas. That incident further enraged them. They were only waiting for a ruse to settle scores with Madigas. The Madigapalle of Karamchedu wa full of self-respect. Four hundred families had the same surname. Families of Tella and Duddu were the main force of Madigas. They were all warriors and experts in karrasamu. They used to perform martial art with sticks to the rhythm of billamgodu tune. Yehoshua was the best among them. The Madigapalle was bound by a code of conduct. Elders watched over its strict adherence. Madigas were agricultural labourers. Though they depended on Kammas for their modest living, they never compromised on self-respect. They fought to the end in defence of their dignity. Kammas flourished on all fronts all over the State. In Karamchedu, with the help of Kuppuswamy, a Justice Party leader, and Congress and Communist party leaders, they accumulated wealth and properties. Kammas, from the beginning, maintained a unique nature. Rank selfishness had always been in their blood. They worked in different parties. But they joined hands in protecting their caste interests and hegemony. The Karamchedu landlords had become very rich. They raised cotton, tobacco and other cash crops along with traditional crops. They monopolized trade, moneylending business and particularly cinema industry. The Telugu Desam Party, which was set up to counter Reddy politics, had its roots in Karamchedu. The village landlord, Daggubati Chenchuramaiah, was related to TDP leader N. T. Rama Rao. His son, Daggubati Venkateswara Rao, was married to NTR's daughter. Relationship with NTR had only added to the arrogance of Karamchedu Kammas. Police and revenue officials became henchmen of Daggubati family. With that, no one could stop Kammas. Their caste grip, muscle power and political arrogance increased. They treated other caste people as menials. They committed atrocities on helpless people. They raided houses and harassed poor women sexually. Venkatesu, a Kamma youth and son of Yerram Kanna, went to the house of Tirupataiah and Yerukula, and misbehaved with his daughter. Tirupataiah and his wife tried to stop him. Venkatesu assaulted the couple. A few Dalit youth were watching the Kamma youth's unruly behaviour. They intervened and forcibly stopped Venkatesu from teasing Tirupataiah's daughter. Kammas took this incident as an affront to their caste supremacy. Malas, Madigas and Yerukulas were living side by side in Karamchedu. Kammas' kalyanamandapam (marriage hall) was located nearby. Dalit women used the nearby bund as an open toilet. Kamma youths, particularly Lakshmaiah, son of Gotori Burraiah, llamma, grandson of Munirattaiah, Venkateswarlu (Venkatesu), son of Yerram Kanna, teased them. The Madiga youth put an end to their beastly games. Kammas were naturally peeved at the Dalit youths' intervention. After NTR had formed Telugu Desam Party, all Kammas jumped into it. Dalits remained in the Congress Party. An eyesore for Kammas. Elections were announced. NTR's son-in-law and Chenchuramaiah's son Daggubati Venkateswara Rao contested for the MLA seat. Chenchuramaiah came to the Madigapalle and met the elders. 'My son is contesting. You all should vote for him,' he said. The latter said they would have to think about it. On the election day, polling was in progress. Dalits were voting for the Congress Party. The TDP agents obstructed Dalits, pushed them out and tried to shut the booth doors. Dalits resisted. The TDP agents and hooligans clashed with them. In the evening on the same day, about 300 Kammas surrounded the Madigapalle. Undaunted, Madigas faced them. Kammas, taken aback, retreated. From then on, Kammas spit venom on the Madigas and waited for a pretext to pick up a row with them.
July 16, 1985
Kamma youth, Potina Seenu and Rayineedu Prasad, took their buffaloes to the drinking water tank in the Madigapalle. They fed the buffaloes with washings of rice in buckets. While they were washing the dirty buckets in the tank, Katti Chandraiah, a Dalit boy, objected to it. His courage angered Seenu and Prasad. They were about to beat up Chandraiah when Munnangi Suvaartha, a Madiga woman, came to the tank to collect water. She tried to protect the boy from the attack of Kamma youths. Seenu and Prasad threw hunters at her. She lifted her vessel and warded off the hunters. Suvaartha's lifting of vessel in self-defence became a pretext for Kammas, who were itching for a fresh quarrel with Madigas after the election clash. They used the trivial occasion for a ghastly attack on Madigas. 'A Madiga woman lifted the vessel to attack Kammas. There was no meaning for our caste domination,' fumed Kammas. But they knew that they alone could not attack Madigas. They mobilised Kammas of seven surrounding villages, swooped on the Madigapalle on July 17th morning. They raided every Dalit's house, drove Madigas into fields. The blood thirsty Kammas beat Madigas, stabbed them and axed them. They raped Dalit women. They became murderers and barbarians. They chased and hunted Madigas for over 7 km. The murder and mayhem had no parallel in the Indian subcontinent. It was no exaggeration. Duddu Moshe, Duddu Ramesh, Tella Yehoshua, Tella Moshe, Tella Muthaiah and Duddu Abraham were axed to death by Kammas. In fact, eight Dalits were killed in the Kammas' attack. Police did not show two bodies to the victims and secretly buried them.
Details of the six slain Dalits
1. DUDDU VANDANAM
Age : 35
Wife : Subbulu
Mother : Alisamma
Father : Sujnanam
Son : Samuel (10 years)
Daughters : 1) Jayalakshmi (10)
2) Punnamma (7)
3) Sunitha (4)

2. DUDDU RAMESH
Age : 22
Wife : Sulochana (18)
(Married just a year ago)
Mother : Sundaramma (dead)
Father : Yohan

3. TELLA YEHOSHUA
Age : 55
Wife : Chinnammi
Sons : 1) Kotaiah (30)
2) Adiah (24)
Daughters : 1) Padma (27)
2) Suhasini (22)

4. TELLA MOSHE
Age : 70
Wife : Veeramma
sons : 1) Kripa Rao (35)
2) Ravi (29)
Daughters : 1) Ruthumma (37)
2) Deenamma (32)
3) Rattamma (25)

5. TELLA MUTHAIAH
Age : 45
Wife : Atchimma
Sons : 1) Papaiah (25)
2) Lakshmaiah (18)
3) Prabhakar Rao (11)
4) Kishore (9)
Daughters : 1) Mariamma (16)
2) Eeramma (4)

6) DUDDU ABRAHAM
Age : 40
Wife : Ahalya
Mother : Atchamma
Father : Rattaiah
Son : 1) Srinivas (20 )
2) Venkateswarlu (10)
Daughters : 1) Padma (7)
2) Chittemma (4)

The economic and social background, which prompted the upper caste people to indulge in murder and arson, should be studied to understand the nature of the Karamchedu carnage.

ప్రకృతి భాష

సముద్రం
కొండ చరియలను
తాకినపుడు అందం
అనంతమైనదాన్ని
పట్టి పుడిసిలించినట్లు అనుభూతి
శిల్పంలో
సజీవతే కాదు
వైజ్ఞానికతావుంది
ఏ శిల్పి నైపుణ్యమైనా
అది సృష్టిలోని సౌందర్యాభివ్యక్తే.

అవును
ఎన్నో అభివ్యక్తులు శిలా సదృశాలే
మనిషికి
దేనికి స్వేఛ్చవుంది
ఏ విలువల కోసం పోరాడుతున్నామో
అవి సంకెళ్ళు బిగిస్తాయి.
ఆధార ఆధేయితాల పెనవేత
తగ్గేకొలదీ
ఏపుగా పెరుగుతున్న
సరిగ చెట్టులా
ఒంటరి సంగీతం

అవును! నిజమే
తోడు గొప్పదే
అక్షరాలు తోడు కోల్పోతే
భావ శున్యమైనట్టు
అవును!
భయం ఒక భూతంమే
చల్లగాపారుతున్ననదిని కూడా
విసురుతున్న తుఫానులాగే భావిస్తుంది
నిజమే! ఆ నది
పాయలు పాయలుగా
విడిపోతున్న చోట
బొట్లు సందిగ్ధంలోనే ఉన్నాయి!
ప్రకృతిది సహజ సౌందర్యం
ఒక్క  గడ్డిపూవు చాలు
ఎంత ఎత్తైన కొండకు కూడా
కిరీటమే

నిజమే!
అది కారపు బంతిపువ్వే
నీళ్ళ పోత కూడా లేకుండా
మంచులో పెరిగింది
ఆ  పక్కన గట్టుమీద
పుట్ట కొక్కులు
సహజంగానే మోలిశాయి
అవును!
ఆ  కృత్రిమ ఉద్యానవనాల కంటే
యివే నన్ను ఆకర్షిస్తున్నాయి
వీటికి సూర్యుడు తెలుసు
వెన్నెల తెలుసు
మనిషి వెలుగులో వున్నాననుకొని
అంధకారంలో వున్నాడు

సరిగా ఆ సూర్యుణ్ణి చూడగలిగితే
ఈ మెర్క్యురీ లైట్ల కూసం
ఆరాటం ఎందుకు?
కొన్నిసార్లు కళ్ళు మాట్లాడీ
మాట్లాడీ అలసిపోతాయి
అభివ్యక్తి శూన్యతను అంతా
కనురెప్పలే మోయాలి
ఇసుక తిన్నెల మీద
ముద్రించిన ప్రతి అడుగు
శిలా శాసనమే,
అడుగులు కూడా అన్నిసార్లు వేయలేము
చరిత్ర అనేక అస్తికలను
మిగిల్చింది
వాటి ఆరాటం సముద్రంలో
ఘోష పెడుతూనే వుంది

నిజమే!
ముగింపు లేనిదే మౌనం
దానికి అనంత భాష
ప్రకృతి దాని బడి
జీవన వ్యవస్థలన్నీ
ప్రతిఫలిస్తాయనేదే ఆశ
అటు వేపే నా పయనము...
నడుస్తున్న చరిత్ర జూలై 2011 సంచికలో ప్రచురించబడినది.

కోటగోడలు కూల్చేస్తుంది

                                                                                                   15.7.11
మన ఆర్ధికామత్యులు
ప్రణబ్ దృష్టిలో
రూపాయి అంటే
వస్తువులు కొనేది
కానీ, వాటికి ముందు
పప్పులు ఉప్పులు
కొనాలికదా!

గుడిశే చూడనివాడికి
ఆరిపోయిన పొయ్యి గురించి
ఏమి తెలుసు?
కట్టెల మోపు గురించి
ఏమి తెలుసు?

పేదరికం ఒక సమస్య
కాదు సుమా!
దానికి కోటగోడలు కూల్చే
శక్తి వుంది మరి!

ఉగ్రవాదం ఏదైనా అమానవత్వమే

                                                                                         14.7.11
ముంబైలో అనునిత్యం
బాంబు బ్లాస్ట్లు
ఉగ్రవాదం ఏదైనా
అమానవత్వమే
ప్రపంచంలో పారిన
నెత్తురులో సగంపాలు
మతోన్మాదానిదే
మనిషి వివేచనను
పెంచే ఒక్క పాటశాల
మనకు లేదుకదా!
ఏ విత్తు విత్తితే
ఆమొక్క మొలవదా!

ఉపరితలం కాదు బుర్రనే మార్చాలి

                                                                                 13.7.11
సంస్కరణలన్నీ
ఫేస్ పౌడర్ల లాంటివే
వ్యవస్థ పునాదిని మార్చాలంటే
ఆలోచనల్లో మార్పురావాలి


సి. బి. ఐ ఒక పక్క
అవినీతిని తవ్వుతుంది
మరోపక్క దేవాలయాల్లో
అంతర్దేవాలయాలు
తవ్వేకొద్దీ పుత్తడి నిధులు


ఒకడి కాలుతున్న పొట్టకు
రొట్టె లేదు
ఒకడికి ఆచారం పేరుతొ
నేతి గారెలు


ఈ దేశానికి ఉపరితలం కాదు
బుర్రనే మార్చాలి.

అప్పుడందరూ గమ్యానికే చేరతారు!

                                                                                                               11.7.11
రైలుబోగీలు అగ్గిపెట్టేల్లా
కూలుతున్నాయి
నెత్తురు కాల్వలైనా
జలపాతాల సౌందర్యంలా
మంత్రులు వీక్షిస్తున్నారు
వీరికి మంత్రాంగం తప్ప
యంత్రాంగం లేదు
ఇంగ్లీషువారు నిర్మించిన
పురాతన పట్టాలకు
శీలలు గొట్టేవారులేరు
రాజ్యానికైనా
మనిషికైనా
శీలమే బిగువు
అప్పుడందరూ
గమ్యానికే చేరతారు.

ఆలోచించే మానవుణ్ణి సృష్టించండి

                                                                              10.3.11                                                                                                        
మెదడులేని జనాభా
ఎంత ఎదిగితే ఏముంది?
ఆహారం కోసం పోరాటం తప్ప
ఆలోచించే శక్తిలేదు
దేశంలో దాన్యాగారాలన్నీ
పందికొక్కులకే ఎరవుతున్నాయి
పిల్లలకివ్వాల్సిన బొక్కుల గూడాల్లో
చెదలు బడుతున్నాయి
మంత్రివర్యుల సమాలోచనలన్నీ
దారిద్రియాన్ని
భావదారిద్రియాన్ని
కాపాడడానికే
ముందు ఆలోచించే మానవుణ్ణి
సృష్టించండి
తరువాత జనాభా పెరిగినా
విశ్వం వారిని భరిస్తుంది.

ప్రతి రాజూ హంతకుడే!

ప్రతి రాజూ హంతకుడే!
రాజకుమారులు ఆ సమాధుల
సంఖ్యను పెంచేవారే
వీరు చేసే కీర్తనలన్నీ
మరణ గీతాలే
జీవించేవాడు ఒక్కడే
సమాజ గతిని నిర్ణయించేవాడే
వాడే దార్శనికుడు!

నిజానికి యుద్ధం
యిప్పుడే ఆరంభమయింది
జీవితంతోనూ! సమాజంతోనూ!
మనిషి తననుతాను
తెలుసుకునే లోపే
మరణించడం ఒక సత్యం
యుద్ధ ప్రియులే జీవిస్తున్నారు
జీవించినప్పుడూ
మరణించినప్పుడు..

కులం


కులం ఒక సామాజిక నిర్మాణం కాదు
ఒక సామాజిక విభజన
కుల అస్తిత్వవాదం
కుల నిర్మూలనకు దారి తీయాలి
అంబేడ్కరిజం ఒక్కటే
జాతీయతకు మార్గం
మానని గాయానికి
మైపూతలు పూసినంతకాలం
పుండు పుండే
మందు మందే
 
Dr. Kathi Padma Rao

లక్ష్య శుద్ధి లేక

లక్ష్య శుద్ధి లేక
నిర్లక్ష్యం అవుతున్న
లక్షల కోట్ల బడ్జట్లు
చిల్లులు బడిన కుండలో

నీల్లెన్ని పోసినా
నేల పాలవడమేగాని

జనం దాహం తీరదు కదా

Dr.Kathi Padma Rao

భ్రమలో బ్రతికే దేశంలో

ఆలయాల గర్భాల్లో
బంగారపు నిధులు
గర్భిణి స్త్రీ ప్రసవానికి 
పక్కలేని ఆస్పత్రులు
భ్రమలో బ్రతికే దేశంలో
వాస్తవానికి తావులేదు













A List of my Publications

BOOKS AUTHORED


1.Jana Geetham -1979
2. Hethuvada Satyalu -1980
3. Kulam Punadulu - 1981
4. Samghika Viplava Rachayithalu - 1983
5. Kula Samgharshanalu -1983
6. Women and Caste in India (English) -1983
7. Jailu Gantalu (Poetry) -1986
8. Desam Diary -1987
9. Vimukthi Geetham (Poetry) -1987
10. Samghika Viplavamoorthy: Dr. B. R. Ambedkar-1990
11. Reservations: Hindu Mathonmadam -1991
12.  Social and Philosophical Movements in India  (English) -1991
13.  Dalit Women (English)- 1991
14.  Dalithula Charitra-1st Part(2nd Edition) -1991
15.  Charvaka Darshanam (2nd Edition) -1991
16.  Raktha Kshetram (Poetry) -1992
17.  Bharatheeya Samskruthilo Sthree -1993
18.  Kulam - Prathyamnaya Samskrithi- 1993
19.  Dalitha Sahitya Vudyamam - Joshua -1995
20.  Dr. B. R. Ambedkar: The Visionary (English) -1995
21.  Caste and Alternative Culture (English) - 1995
22.  Joshua Samajika Thatvam (2nd Edition) -1995
23.  Pratyamnaya Samskrutilo Periyar Mela - 1996
24.  Nalla Kaluva (Poetry) -1996
25.  Dalithula Charitra -2nd part (2nd Edition)-1997
26.  Buddha Darshanam -1997
27.  Neelikeka (Poetry) -1998
28.  BCla samajika Charitra – Sahityam -1998
29.  Charvaka Darshan (English) -1998
30.  Dalithula Charitra -3rd part - 1998   
31.  Woman in Indian Culture (English) - 1999
32.  Journey towards Dalit Dignity (English)- 1999
33.  Dalithula Charitra -4th part-1999
34.  Ambedkar-Gandhi (3rd Edition)- 2001
35.  Ambedkar-Marx-Phule (3rd Edition)- 2001
36.  Mullakireetam (Poetry)- 2002
37.  Ambedkar-Buddhudu (2nd Edition)- 2002
38.  PitruSwamya Vyavasthalo Sthree- 2002
39.  Bhoomi Basha (Poetry)- 2004
40.  Andhrula Samajika Ardhika Parinamalu- 2006
41.  Kattela Moppu (Poetry)- 2007
42.  Budhisit Philosophy (English)- 2007
43.  Ambedkar Thatvasastram- 2007
44.  Mahakavi Jashuva Samajika Viplavam- 2007
45.  Dalit Literature - A creative alternative (English)- 2008
46.  Santh Ravidas Bhakti kavitodhyamam- 2008
47.  Dalita Darshanam - 2008
48.   Mahatma Phule (3rd Edition)- 2008
49.   Dalitula Charitra - 4th part -2009

Telangana

తెలంగాణా పోరాటం
త్యగపూరితమైనది
అది తన చరిత్రను 
తానే లిఖించు కుంటుంది
తెలంగాణా పోరాటాన్ని
నిర్లక్ష్యం చేసినవారిని
చరిత్ర గుర్తించదు.