12 .4 .12
ఆ అమ్మ ఓ కుండెడు
నీళ్ళు మోసుకు నడుస్తూనే వుంది.
నీళ్ళు మోసుకు నడుస్తూనే వుంది.
సెగ ఇసిరి ఇసిరి
కొట్టేటప్పుడు కూడా
కళ్ళలో వున్న కాంతి తగ్గలేదు
నదీ తరంగాల ప్రక్కన జీవిస్తున్నామా!
ఇసుక మేటల ప్రక్కన జీవిస్తున్నామా !
అన్నది కాదు.
కొంగు చాటుగా
సూర్యుడు దాక్కోవాలనుకున్నాడు.
అన్నీ చిరుగులేమరి
ఇసుక మేటలకు కందిన అరికాళ్ళు
ప్రకృతి కొన్నిసార్లు
పేదలకు శత్రువా !
మిత్రమా !
హద్దులు దాటినపుడంతా
అది పిల్లలు గన్న తల్లుల పైనే
కాలు దువ్వుతోంది సుమా !
No comments:
Post a Comment