అన్యాయాలను చెండాడిన ‘కత్తి’
ఉద్యమిస్తే చావో రేవో తేల్చుకుంటారు. కలంపడితే కాగితాల దొంతరలు సైతం దాసోహమనాల్సిందే. అందుేకనేమో... ఆయనకు మాస్ ఫాలోరుుంగ్ ఎంత ఉందో... అంతకు మించిన క్లాస్ అభిమానులూ ఉన్నారు. అంతమందిని కూడగట్టుకోవడం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులున్నారుు. అంతకు మించిన త్యాగం దాగుంది. డాక్టర్ అంబేడ్కర్ ఏం చెప్పారో అది చేసి చూపారు ఈ డాక్టర్.
అందుేక పద్మారావును చాలామంది అభినవ అంబేడ్కర్‌గా అభిమానిస్తారు. అంబేడ్కర్ పుస్తకాలు చదివే ఓపికలేనివారు డాక్టర్ కత్తి పద్మారావు జీవితంలోని సంఘటనలు తిరగేస్తే చాలు... బాబాసాహెబ్ ఏం చెప్పారో, ఏం చేయమన్నారో క్షుణ్ణంగా అర్దమవుతుంది. పద్మారావు దళితుల కోసమే కాదు.. బాధిత అగ్రవర్ణాల అభాగ్యుల కోసం కూడా పోరాటాలు చేశారు. కత్తి పద్మారావు అంటే దళిత పక్షపాతే కాదు. మానవతావాది కూడా.
అందుేక పద్మారావును చాలామంది అభినవ అంబేడ్కర్‌గా అభిమానిస్తారు. అంబేడ్కర్ పుస్తకాలు చదివే ఓపికలేనివారు డాక్టర్ కత్తి పద్మారావు జీవితంలోని సంఘటనలు తిరగేస్తే చాలు... బాబాసాహెబ్ ఏం చెప్పారో, ఏం చేయమన్నారో క్షుణ్ణంగా అర్దమవుతుంది. పద్మారావు దళితుల కోసమే కాదు.. బాధిత అగ్రవర్ణాల అభాగ్యుల కోసం కూడా పోరాటాలు చేశారు. కత్తి పద్మారావు అంటే దళిత పక్షపాతే కాదు. మానవతావాది కూడా.
ఖణేల్... ఖణేల్... మంటూ నిప్పు కణికలు ఎగిసిపడుతున్నాయా? అంటే అక్కడ కత్తి పద్మారావు ఉపన్యసిస్తున్నారని అర్థంఆ గ్రంథంలోని పదం పదం హృదయాంతరాళను తాకుతోందా? అరుుతే అది కచ్చితంగా కత్తి పద్మారావు రచనే!.
గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజులవి. కళాశాలకు సమీపంలోని బ్రాహ్మణ వీధిలో మాధవీలత అనే యువతి హత్యకుగురి కాగా ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనికి పోలీసులు వంతపాడారు. విషయం తెలి సిన పద్మారావు వాస్తవాలు సేకరించారు. మాధవీలతను అత్తింటి వారు పోసి కాల్చి చంపారని తెలిసింది. ఇన్‌స్పెక్టర్ చక్ర పాణి డబ్బు తీసుకుని కేసు మాఫీ చేసే ప్రయత్నం చేశారని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు.
కత్తి పద్మారావు ఉద్యమించారు. దీంతో చక్రపాణి ఉగ్రుడై పద్మారావుపై గుక్కతిప్పుకోలేని అక్రమ కేసులు బనాయించారు. కాలేజి నుండి ఆయనను సస్పెండ్ చేయించే ప్రయత్నం చేశారు. ఎన్ని వత్తిళ్లు వచ్చినా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆపలేదు. ఇక కారంచేడు, చుండూరు ఘటనలలో ఆయన చేసిన సాహసాలే ఆయన్ను హీరోను చేశాయి. అప్పటి వరకు పొన్నూరు అంటే ఆచార్య ఎన్ జి రంగా, చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య పేర్లు మాత్రమే జాతీయస్థాయిలో వినిపించేవి. అయితే వారి పేర్లను వెనక్కు నెట్టి కత్తి పద్మారావు పేరు ముందువరుసలో నిలిచింది.
ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది!.కారంచేడు... చుండూరు... పేర్లు వినగానే ముందుగా గుర్తొచ్చేది కత్తి పద్మారావు పేరే! చెల్లాచెదురైన దళిత కుటుంబాలను ఏకం చేసి కన్నీరు తుడిచి ధైర్యం నూరిపోశారు. అంతేకాదు... అగ్రవర్ణ పెత్తందార్లు మరెక్కడా దళితుల ఊసెత్తే ధైర్యం చేయకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెప్పించారు. ఉద్యమాలను ఆయన ఏసీ కార్లలో తిరిగి నడపలేదు.
భార్యాపిల్లలు ఆర్థాకలితో మాడుతున్నా, తన రక్తం చిందించి, నాసా కింద జైళ్లలో మగ్గి దళితులకు ఆత్మగౌరవ పోరాటాలు నేర్పారు. ఆయన ఏ ఉద్యమంలోనూ దళితుల్ని టోకున అమ్మే ప్రయత్నం చేయలేదు... దళిత దళారీగా మారనూలేదు. కనుకనే ఆయన పట్టుకున్న ప్రతి ఉద్యమం విజయం సాధించింది. కారంచేడు బాధిత కుటుంబాలకు చీరాలలో విజయనగర్ కాలనీ ఏర్పాటుచేశారు. ఇప్పుడా కాలనీలో విద్యావంతుల సంఖ్యే ఎక్కువ. ఇక చుండూరు దళితులు స్వపరిపాలన చేస్తున్నారు.
ఇదంతా ఒకవైపే. మరో పార్శ్వంలో ఆయన బ్రాహ్మణవాదానికి ప్రత్యామ్నాయ వాదాన్ని వినిపించడంలో ఉద్యమానికి మించిన పోరాటం చేశారు. జిల్లెల్ళమూడి సంస్కృత కళాశాలలో చదివే రోజుల్లోనే కుల ప్రభావం బాగా తెలిసొచ్చింది. కొ న్ని చదువులు కొందరికే పరిమితం చేస్తున్నారని గ్రహించారు. కునుకనే సంస్కృతం చదువును ఆయక ఒక ఉద్యమంగా చేపట్టారు. వేదాలు మొదలు... ప్రబంధాల వరకు అవపోసన పట్టారు. తర్వాత మార్క్సు, అంబేడ్కర్ గురించి పరిశోధనలు చేశారు.
ఈ సంస్కృతాంధ్ర పండితుడు తనలోని కవిని హేతువాదిని, చరిత్రకారుని, విశ్లేషకుని, తత్వవేత్తను మేళవించి రచనలు చేశారు. తన రచనల లక్ష్యం దళితుల చైతన్యమే. ఈ చలిచీమల దండును ఏకం చేసి బ్రాహ్మ ణవాదానికి ప్రత్యామ్నాయవాదం వైపు నడిపించటమే.
ఆయన కలం-గళం సమ్మిళితమైన ఆయుధం. కనుకనే 30ఏళ్ల వయసులోనే పెదపులివర్రులో శంకారాచార్య పీఠం నిర్వహించిన పోటీలో పాల్గొని శంకరాచార్యుల సిద్ధాంతం అశాస్ర్తీయమని నిరూపించి వాళ్లనుండే 10వేల రూపాయలు బహుమతి గెలుచుకున్నారు. మానవ పరిణామ క్రమంలో పోరాటం చేయని జాతి నశించి పోతుందని డార్విన్ మహాశయుడు చెపుతూ, ఉదాహరణగా అంతరించిపోయిన డైనోసార్లను చూపారు. అయితే పద్మారావు మరో అడుగు ముందుకు వేశారు. జ్ఞానం, విద్య, అవగాహన, నిర్మాణం... ఉన్న జాతులు నిరంతరం శక్తివంతమవుతాయని చెప్పారు.
చెప్పడమే కాదు... ప్రభావితులను చేసే ప్రయత్నంలో నిరంతరం కలాన్ని పరుగులు తీయిస్తూనే ఉన్నారు.అంబేడ్కర్ గ్రంథాలను ప్రతి దళితుని ఇంట్లో ఉండాలంటారు పద్మారావు. గృహ గ్రంథాలయాలను స్థాపించాలని చెప్పడమే కాదు... పొన్నూరులోని తన ఇంటినే పెద్ద గ్రంథాలయంగా మార్చారు.
ఇక హైదరాబాద్‌లోని తన నివాసం కూడా రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు.. పద్మారావు నిడమర్రులోని చార్వాల ఆశ్రమంలో స్వర్ణకుమారిని కులాంతర వివాహం చేసుకుని... వేల సంఖ్యలో కులాంతర వివాహాలు చేశారు. అంతేకాదు... తన ఇద్దరు తమ్ముళ్లకు, కుమారునికి కూడా కులాంతర వివాహాలే చేసి ఆదర్శాన్ని చాటారు. ఆయనకు భార్య స్వర్ణకుమారి. కుమార్తె సృజన, కుమారులు చేతన్, లోకాయత్‌లతోపాటు కోడలు నళిని నుండి కూడా పూర్తి సహకారం అందుకుంటున్నారు.20 దేశాలు పర్యటించిన పద్మారావు అక్కడ ఉపన్యాసాలతో సరిపెట్టుకోలేదు.
ఆయా దేశాల్లో ఎటువంటి వివక్ష ఉందో వాటి మూలాలు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ హేతువాదిలోని తత్వవేత్త ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పారు. కనుకనే ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో ‘కత్తి పద్మారావు-దళిత సాహిత్యం’పై పరిశోధనలు ప్రారంభమ య్యాయి. ఇప్పటికే అమెరికాలోని క్యాలిఫోర్నియా, ఢిల్లీ, హైదరాబాద్‌లలోని సెంట్రల్ యూనివర్శిటీల నుండి ముగ్గురు స్కాలర్స్ పిహెచ్‌డి పొందారు.
మరెందరో ఇదే ప్రయత్నంలో పద్మారావు రాసిన పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. అక్షరం దిద్దని తల్లిదండ్రుల కడుపున పుట్టిన పద్మారావు నేడు మార్గనిర్దేశకుడుగా మారారు. పండిత పుత్రులు కూడా ఒక్క గ్రంథం రాయాలంటేనే ప్రసవ వేదన పడుతుంటే ఆయన 58 ఏళ్లకే 56 పుస్తకాలు రాశారు. ఆయన సెంచరీ దాటిస్తారని ఆశిద్దాం...
ఆయన సమాజం నుండి మంచిని గ్రహించి సమకాలీన ప్రపంచానికి పంచే ప్రయత్నం చేస్తున్నారు. ధనానికీ, వ్యామోహానికీ, ఆధిపత్యానికీ, ఆభిజ్యాత్యానికీ లొంగలేదు. కనుకనే ఆయనకు భీతిలేదు. అనారోగ్యంతో శరీరం సహకరించకపోరుునా ఆయనలోని తృష్ణ ముందుకు నడిపిస్తోంది.
సూప్‌కి...గంజికి తేడా ఉంది....
ప్రాస కలిసింది కదా... అని స్టార్ హోటల్స్‌లో భోజనానికి ముందు సూప్ పేరుతో ఇచ్చే గంజితాగిన వారు... ‘గం జికి-బెంజి’కారుకు ముడిపెడితే ప్రజలు నమ్మరు! అయితే పద్మారావు జీవితంలో కనిపించే ఈ గంజి... బడుగుల జీవన చిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తుంది... పద్మారావు చిన్నతనం లో చీరాల ఐఎల్‌టిడి కంపెనీలో పనిచేసేవారి మూడు కాలనీల లో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్లన్నీ కాలిపోయాయి. అక్కడి పేద ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు.
వారి ఆకలి తీర్చాలని ఉన్న బియ్యంతో గంజి కాశారు. అక్కడే సమస్య ఎదురైంది! గంజి ఆరిపోతే గడ్డకట్టి పోతుంది. పైగా తాగేవాళ్లకు కూడా మింగుడు పడదు. ఇక వేడివేడి గంజి పోద్దామంటే కనీసం పాత్రలు లేవు. దోసిట్లో పోయలేరు. అక్క డున్న పద్మారావు పిల్ల గ్యాం గ్ క్షణాల్లో ఊరి చివరి డొం కలోకి వెళ్లి తాటాకులు కొట్టుకొచ్చి డొప్పలు తయా రుచేశారు. దాంట్లో వేడివే డి గంజి సప్లై చేశారు. ఎం డిన డొక్కలు పూడకపోయి నా.., వాళ్ల కళ్ళల్లో మాత్రం తృప్తి. ‘పేదరికం చూశాను కనుక గంజి విలువ తెలుసు. చిన్నతనంలో ‘సువార్త దళం’ పేరుతో మా పిల్ల గుంపు చేతనైన సహాయం చేసేది. బైబిల్ క్లాసులు భాష, సేవాభావాన్ని నేర్పాయి. క్రీస్తు పాటలు పాడడం, నాటకాలు వేయడంతో స్టేజ్ ఫియర్ పోయింది...’ అంటారు.
గుండెల్లో నిద్రపోతా...
ఇదేం సినిమా డైలాగ్ కాదు... చుండూరు ఊచ కోత కు గురైన దళితుల శవాలను ఆ గ్రామంలో సమా ధి చేయించే ప్రయత్నం చేశారు పద్మారావు. ఆ చుట్టుప ట్ల ఉన్న గ్రామాలలోని రెడ్డి కులస్తులేకాదు... అగ్రకులా లు మొత్తం ఏకమై తిరగబడ్డాయి. ఢిల్లీ నడిబొడ్డులో గాంధీని, ఇందిరాగాంధిని సమాధి చేయలేదా? అని పద్మారావు ప్రశ్నించారు. మనువాదులు ఏ దళితులనైతే ఊరి చివరికి నెట్టాలనుకున్నారో వారికి దిమ్మతిరిగిపో యేట్టు ఊచకోతకు గురైన దళితుల శవాలను ఊరి మధ్య ఖననం చేయించారు. పైగా అగ్రవర్ణాలకు నిద్రలో గుర్తుకొచ్చినా ఉలిక్కిపడే విధంగా ఆ స్థలానికి ‘రక్త క్షేత్రం’ అని పేరు పెట్టారు.
ప్రొఫైల్
తల్లిదండ్రులు : మాణిక్యమ్మ, సుబ్బారావు.
పుట్టిన తేదీ : 27 జులై, 1953
స్వస్థలం : ఈతేరు , గుంటూరు జిల్లా
పురస్కారాలు : 1992లో అంబేడ్కర్ అవార్డు,
2003లో సినారె సాహితీ
పురస్కారం,
2006లో ఆంధ్ర సారస్వత
పరిషత్ అవార్డు,
2006లో పొట్టి శ్రీరాములు
తెలుగు యూనివర్శిటీ అవార్డు,
2006 బోరుు బీమన్న ట్రస్ట్
అవార్డ్డు,
2008లో ఆచార్య నాగార్జున
విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్
2010లో ‘మహాకవి’ బిరుదు
-వేణుగోపాల్ తలతోటి
No comments:
Post a Comment