కన్నీళ్లు ఇంకిన చోట
దుఃఖం నటిస్తున్నారు
ఎవరు దోపిడీ దారులో వారే
దొంగలు దొంగలని కేకలేస్తున్నారు
దేశంలో దొంగలు బడ్డారు
ఇప్పుడొక హాస్య నాటిక !
సముద్రం కదలాడినపుడంత
ఆ గుడిసె కు గుండె పోటే మరి
వారెందుకో దేనికోసమో
పాకులాడుతూనే వుంటారు
ఏది దొరికినా మరోకదానికోసమ్
అన్రెస్ట్ మరి
స్థిరత్వం వారికి కోరవడింది
చెట్టులు, పుట్టలు
వాగులూ, వంకలు పట్టుకు
తిరుగుతున్నారు
అవును!
దేశంలో ఏమ్మార్పుంది?
కన్నీళ్లు ఇంకి ఇంకి
భూమి గిడస బారింది
గ్యాసు నిధులు
ఖనిజ సంపద
బొగ్గు గనులు
సముద్ర తీరాలు
ఒకటేమిటి
అన్నింటిని అమ్ముకున్న వాళ్ళు
ఊరూరా విగ్రహాలయ్యారు
ముందు అందరూ శభాష్ అన్నారు
తర్వాత అందరూ దిష్టి బొమ్మ అన్నారు
అవును!
అనేక మంది హతులు ప్ర సిద్ధు లే
హంతకులు అనామకులు
ప్రతి కుంభ కోణం వెనుక
ఒక అగ్ని పర్వతం
అవును!
చైనా సముద్రంలో
అమరులైన భారతీయులు
స్మృతి వెనుక ఎవరి అలసత్వం వుంది?
కాశ్మీరు తెల్ల తెమ్మెర్లలో
ఎర్ర చారలు
ఏ గులాబీ రేకులవి?
నిజమే!
తవ్విన కొద్ది
ఎన్ని పుర్రెలు
ఎన్ని కధలు
చెప్తున్నాయో
ఒక్కో విగ్రహం వెనుక
ఒక్కో అరణ్య పర్వం వుంది
వ్యక్తిత్వాల ప్రకాశం
సత్య వాక్కుల్లోనే వున్నాయి
సత్యం ఒక జీవన వేదం.
Dr. Kathi Padma Rao
21.10.12