నేటి శిశువు రేపటి వెలుగు రేఖ

నిరంతర సృష్టి సమాజ పరిణామానికి ఆయువు
నేటి శిశువు రేపటి పౌరుడు,మేధావి,శాస్త్రజ్ఞుడు,వెలుగు రేఖ
ఆడ శిశువు ప్రకృతి ప్రతిరూపం
శిశువుని చిదమడం అంటే జీవన వ్యవస్థపై గొడ్డలివేటు వేయడం
విత్తనాన్ని భగ్నం చేశాక వృక్షం ఎక్కడి నుండి వస్తుంది?
పునాదులను నిర్మించాల్సిన మనిషి వాటిని తవ్వేస్తున్నాడు
దీనికి మూలం లింగ,కుల వ్యవస్థలే
మెదడు సారవంతమైనప్పుడే సమాజానికి భవితవ్యం !!

మేధావి అంటే సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు


పండితుడు అంటే అధ్యయనపరుడు
మేధావి అంటే సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు
బుద్ధుని తరువాత సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు అంబేడ్కరే
అందుకే ఆయన మేధావి
మన పండితులు తిలక్,గాంధీ,నెహ్రు,ఠాగూర్,వివేకానందుడు
వీళ్ళందరూ సమాజాన్ని వ్యాఖ్యానించినవారే
అంబేడ్కర్ సమాజ పునర్నిర్మాణానికి సూత్రాలను నిర్మించారు
సమధర్మం,సత్యవాక్కు,సునీతి,సహనత,సచ్ఛీలత,సమ్యక్ దృష్టిని బోధించారు
అందుకే ఆయన మహా బోధి
రెండువందల భాషలు,వివిధ మతాలు,జాతులు కలసి జీవించే ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన మేధావి
ఆయనే నేటి భారతదేశ పునర్నిర్మాణానికి మార్గం.

మతోన్మాదం పేరుతో ఎంత నెత్తురు భూమిని తడిపిందో!

బడిలో పిల్లోడికేమో వుడికీ వుడకని అన్నం
మనిషి చేత్తో చేసిన మట్టి బొమ్మలకేమో వుండ్రాళ్ళ నైవేద్యం
మనిషి చేసిన దేవుడు మనిషినే తనకు బానిస చేసుకున్నాడు ఆలోచనా శక్తిని చంపి వున్మాదానికి తెరలేపాడు
మనిషి అనేకం సృష్టించాడు...
అన్నీ మనిషి అదుపులోనే వున్నాయి
ఒక్క దేవుడు మాత్రం మనిషిని మత్తులో ముంచుతున్నాడు
మతోన్మాదం పేరుతో ఎంత నెత్తురు భూమిని తడిపిందో!
మనిషి హేతుమతైనప్పుడే విజ్ఞాన వికాసం!!

మనిషిని మనిషి ప్రేమించడమే మానవ ధర్మం!

బ్రాహ్మణుల్లో పండితులేగాని మేధావులు లేరని అంబేద్కర్ చెప్పారు
ఇది అక్షర సత్యం
మానవుణ్ణి విభజించడం ధర్మమెలా అవుతుంది ?
సామాజిక సంబంధాలు చిక్కబరిచింది బుద్ధుని తరువాత అంబేడ్కరే
ఇతరుల శ్రమను దోచుకోవడం బ్రాహ్మణ ధర్మం
ఇతరులను ప్రేమించడం దళిత ధర్మం
దళిత పల్లెల్లో ఇప్పటికీ భౌద్ధ సంస్కృతే వుంది
మానవత్వ పరిమళాలు ప్రసరిస్తున్నాయి
మనిషి మనుగడకు ఊపిరి కరుణ, ప్రేమలే
మనిషి పూజించాల్సింది రాతి విగ్రహాలను కాదు
మనిషిని మనిషి ప్రేమించడమే మానవ ధర్మం!